నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో గ్రూప్1, గ్రూప్ 2 పోస్టుల భర్తీ

డిప్యూటీ కలెక్టర్లు, సీటీఓలు, జిల్లా రిజిస్ట్రార్‌లు, డీఎస్పీ పోస్టులతో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు తదితర పోస్టులు గ్రూప్‌-1 కేటగిరీలో..

Update: 2022-04-01 05:13 GMT

అమరావతి : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 292 పోస్టుల భర్తీకై ఏపీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1లో 110, గ్రూప్ 2 లో 182 పోస్టులు.. మొత్తం 292 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2 లలో 36 పోస్టులు మాత్రమే భర్తీ చేయగా.. ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది.

డిప్యూటీ కలెక్టర్లు, సీటీఓలు, జిల్లా రిజిస్ట్రార్‌లు, డీఎస్పీ పోస్టులతో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు తదితర పోస్టులు గ్రూప్‌-1 కేటగిరీలో ఉండగా.. డిప్యూటీ తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు, మున్సిపల్‌ కమిషనర్‌, సహకార సొసైటీల అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లు, సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారులు గ్రూప్‌-2 కేటగిరీలో పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.


Tags:    

Similar News