వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు.. జగన్ సీరియస్ కామెంట్స్
విద్యారంగంలో సంస్కరణలు తీసుకు వచ్చి పేదపిల్లల భవిష్యత్ బాగుపడాలన్నదే తమ ఉద్దేశ్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు
విపక్షాలు పాలనను చూసి కడుపుమంటతో రగలిపోతున్నాయని జగన్ అన్నారు. చంద్రబాబు అనుకూల మీడియా తాము చేసే మంచి పని గురించి రాయరన్నారు. గత ప్రభుత్వం ఇవ్వకుండా వదలేసిన ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించామని జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఎల్లోమీడియా ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
దౌర్భాగ్యమైన ప్రతిపక్షం....
రాష్ట్రంలో దౌర్భాగ్య ప్రతిపక్షం ఉందని జగన్ అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర పరువును తాకట్టు పెడుతున్నాయన్నారు. ఇవేమీ తనను బెదిరించలేవని చెప్పారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెన ఉన్నంత వరకూ విపక్షాలు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెబుతున్నానని అన్నారు. ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడు తనకు ఇవ్వాలని కోరుకుంటున్నారన్నారు. నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి పనులకు తాను అండగా నిలుస్తానని చెప్పారు.
విద్యారంగంలో సంస్కరణలు...
విద్యారంగంలో సంస్కరణలు తీసుకు వచ్చి పేదపిల్లల భవిష్యత్ బాగుపడాలన్నదే తమ ఉద్దేశ్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేశారు. పిల్లల చదువులు ఆగకుండా ఉండేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద తల్లుల ఖాతాలలో నగదును జమ చేస్తున్నామన్నారు. వారి వసతి కోసం అదనంగా నిధులు ఇస్తున్నామని జగన్ చెప్పారు. నాడు - నేడు కింద అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల రూపు రేఖలను మారుతున్నాయని జగన్ చెప్పారు.
చదువుకుంటేనే....
చదువుకుంటేనే తలరాతలు మారతాయని జగన్ అన్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా పేదలను అన్ని రంగాల్లో రాణించేలా చర్యలు తీసుకుంటున్నామని జగన్ చెప్పారు. రాబోయే తరం అవసరాలను మనసులో పెట్టుకుని విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. పరిపాలన సంస్కరణలో భాగంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంో కొత్తగా 16 మెడికల్ కళాశాలలు వస్తున్నాయని చెప్పారు. స్కిల్ డెవెలెప్‌మెంట్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.