చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
నెటిజన్లు వేల సంఖ్యలో లైకులు, రీ ట్వీట్లు చేస్తున్నారు. కాగా.. చంద్రన్న 73వ పుట్టినరోజు వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు
అమరావతి : టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నుంచి ఆయన జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విష్ యూ హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారూ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది.
నెటిజన్లు వేల సంఖ్యలో లైకులు, రీ ట్వీట్లు చేస్తున్నారు. కాగా.. చంద్రన్న 73వ పుట్టినరోజు వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని అఖిలాండం వద్ద చంద్రబాబు క్షేమాన్ని కోరుతూ పూజలు నిర్వహించారు. టీడీపీ మీడియా విభాగం రాష్ట్ర సమన్వయకర్త శ్రీధర్ వర్మ 720 కొబ్బరికాయలు కొట్టగా, అలిపిరిలోని శ్రీవారి పాదాల వద్ద టీడీపీ కార్యకర్తలు, నేతలు 1,116 కొబ్బరికాయలు కొట్టారు. పలు ప్రాంతాల్లో అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.