కడప స్టీల్ ప్లాంట్ పై.. టీడీపీ vs వైసీపీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ ప్రశ్న ఇచ్చింది.

Update: 2022-09-16 04:04 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ ప్రారంభించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ ప్రశ్న ఇచ్చింది. దీనిపై టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి మాట్లాడారు. కడప స్టీల్ ప్లాంట్ కు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేశామని, అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 2020లో మళ్లీ మరొక చోట శంకుస్థాపన చేశారన్నారు. శంకుస్థాపన చేసి మూడేళ్లవుతున్నా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. దివాలా తీసిన సంస్థకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు.

కోవిడ్ కారణంగా...
పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తున్నా ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. విభజన చట్టంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి స్టీల్ ప్లాంట్ ను పూర్తి చేసే పని చేయలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వల్ల చేతకావడం లేదని అన్నారు. భూసేకరణ జరిపిన రైతులకు నష్టపరిహారం కూడా అందించలేదన్నారు మూడేళ్లవుతున్నా కడప స్టీల్ ప్లాంట్ ఒక్క అడుగు కూడా పడలేదన్నారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు. దీనికి మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సమాధనమిస్తూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. కరోనా వల్ల రెండేళ్లు ఎలాంటి పనులు చేపట్టలేకపోయామని అన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెట్టుబడులు ఏపీకి అనేకం వస్తున్నాయని తెలిపారు.


Tags:    

Similar News