మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది

Update: 2026-02-11 12:15 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో 2023లో నమోదయిన కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. మరో పీటీ వారెంట్ ను పోలీసులు దాఖలు చేశారు. సంక్రాంతి సంబరాల పేరుతో సత్తెనపల్లిలో లాటరీ నిర్వహించిమోసానికి పాల్పడ్డారన్న ఫిర్యాదుపై ఈ కేసు నమోదయింది.

సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు...
ఇప్పటి వరకూ నమోదయిన కేసుల్లో అంబటి రాంబాబుకు బెయిల్ లభించడంతో మరికొన్ని కేసులను పోలీసులు సిద్ధంగా చేసినట్లు కనిపిస్తుంది. అందుకే బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ ను జారీ చేశారు. దీంతో ఈ కేసులో అంబటి రాంబాబును కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఆయన విడుదలలో మరింత జాప్యం జరిగే అవకాశముంది.


Tags:    

Similar News