Andhra Pradesh : నేడు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ పదవీ బాధ్యతలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా నేడు అనిల్ కుమార్ సింఘాల్ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు

Update: 2025-09-10 02:43 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా నేడు అనిల్ కుమార్ సింఘాల్ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. నిన్ననే తిరుమలకు చేరుకున్న అనిల్ కుమార్ సింఘాల్ నేడు పదవీ బాధ్యలను స్వీకరిస్తారు. నిన్న తిరుపతికి వచ్చిన అనిల్ కుమార్ సింఘాల్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలను తీసుకుంటారు.

నేడు బాధ్యతల స్వీకరణ...
గత వైసీపీ ప్రభుత్వంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ పనిచేశారు. ఆయన తిరుమలలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. దీంతో మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించారు. ప్రస్తుతం ఉన్న శ్యామలరావు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు.


Tags:    

Similar News