ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి

Update: 2022-11-20 06:56 GMT

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం జాఫ్నా తూర్పున 600 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమైంది. వాయుగుండం నెమ్మదిగా కదులుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కలిసే అవకాశముందని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది.

దక్షిణ కోస్తా, సీమ ప్రాంతాల్లో...
ఈ ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశముంది. మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని కోరింది.


Tags:    

Similar News