సహజ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో మొదటి స్థానం

ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌లో అత్యధిక నమోదు 4.07 లక్షల రైతులు నమోదు… 2.72 లక్షల హెక్టార్లలో సాగు

Update: 2026-02-17 13:50 GMT

An Indian farmer wearing a raincoat walks past a paddy field during monsoon rains in Dharmsala, India, Monday, July 19, 2021. (AP Photo/Ashwini Bhatia)

న్యూ ఢిల్లీ : సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే జాతీయ మిషన్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో నిలిచింది. భారత్ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న National Mission on Natural Farming (ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌)లో రాష్ట్రం నుంచి 4,07,373 మంది రైతులు నమోదు అయ్యారని లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది.

దినేష్ భాయ్ మక్వాన , బైబు ప్రసాద్ తారై  అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. జె పీ నడ్డా లోక్‌సభ లో తెలిపిన వివరాలు ప్రకారం దేశవ్యాప్తంగా 8.57 లక్షల హెక్టార్లలో సహజ వ్యవసాయం సాగుతోందని, ఫిబ్రవరి 9, 2026 నాటికి 17.45 లక్షల మంది రైతులు నమోదు అయ్యారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోనే 4,07,373 మంది రైతులు, 2,72,847.47 హెక్టార్లు సహజ వ్యవసాయం పరిధిలోకి వచ్చాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది అత్యధికంగా ఉన్నట్టు వివరించారు. ఇతర రాష్ట్రాల్లో రాజస్థాన్‌ (2,06,492), ఉత్తరప్రదేశ్‌ (2,10,774), మధ్యప్రదేశ్‌ (1,42,676) కూడా గణనీయంగా నమోదు చేసినట్టు గణాంకాలు చూపిస్తున్నాయి.

ఎరువుల వినియోగం తగ్గిస్తే ప్రోత్సాహకాలు

PM-PRANAM పథకం ద్వారా యూరియా, డీఏపీ, ఎన్‌పీకే, ఎంఓపీ వంటి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. గత మూడు ఏళ్ల సగటుతో పోలిస్తే వినియోగం తగ్గిస్తే, ఆదా అయిన ఎరువు సబ్సిడీలో 50 శాతం వరకు ప్రోత్సాహకం లభిస్తుంది.

మొత్తం మంజూరులో 95 శాతం రాష్ట్రానికి కేటాయిస్తారు. మిగతా 5 శాతం పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలు, పరిశోధన, శిక్షణ, ప్రోత్సాహకాల కోసం వినియోగిస్తారు.

ఈ పథకం ఎరువు సబ్సిడీ తగ్గింపుతో వచ్చే ఆదా నుంచే నిధులు సమకూరుతాయని మంత్రి తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికలు సమర్పించాలి. సంవత్సరం చివర వినియోగ ధ్రువపత్రాలు ఇవ్వాలి. గత నిధుల వినియోగం సక్రమంగా ఉంటేనే తదుపరి మంజూర్లు అందుతాయని స్పష్టం చేశారు.

“ఇప్పటివరకు సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు విడుదల కాలేదు” అని ప్రకటనలో పేర్కొన్నారు.

సేంద్రీయ పథకాల విస్తరణ

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ వివరాల ప్రకారం Paramparagat Krishi Vikas Yojana (పీకేవై) కింద 2015-16 నుంచి డిసెంబరు 31, 2025 వరకు 18.84 లక్షల హెక్టార్లు కవరయ్యాయి. 33.93 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం అమలు చేస్తున్న Mission Organic Value Chain Development for North Eastern Region (మోవ్‌సీడీఎన్‌ఈఆర్‌) కింద 2.36 లక్షల హెక్టార్లు కవరయ్యాయి. 2.70 లక్షల మంది రైతులకు లాభం చేకూరింది.

పీఎం-ప్రణామ్‌ పథకం సేంద్రీయ, జీవ, నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. సహజ, సేంద్రీయ వ్యవసాయం, సూక్ష్మ నీటి పారుదల, జీరో టిల్లేజ్‌, సమగ్ర పోషక నిర్వహణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. పీకేవై, మోవ్‌సీడీఎన్‌ఈఆర్‌, ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ వంటి పథకాల సమన్వయంతో అమలు చేస్తోంది.

ఫిబ్రవరి 9, 2026 నాటికి దేశవ్యాప్తంగా 17,45,953 మంది రైతులు ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌లో నమోదు అయ్యారు. 8,57,311.28 హెక్టార్లలో సహజ వ్యవసాయం కొనసాగుతోంది.

Tags:    

Similar News