ఏపీకి మరో తుపాను ముప్పు.. పలు రైళ్ల రద్దు

ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలతోనూ, తుపానులతోనూ ఇబ్బంది పడుతుంది. నవంబరు నెల మొత్తం తుపానులతోనే గడిచిపోయింది.

Update: 2021-12-02 02:10 GMT

ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలతోనూ, తుపానులతోనూ ఇబ్బంది పడుతుంది. నవంబరు నెల మొత్తం తుపానులతోనే గడిచిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా మరో తుపాను ఆంధ్రప్రదేశ్ పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. నవంబరు 29న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.

రైళ్ల రద్దు....
దీని ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఒడిశాకు కూడా భారీ వర్షాల సూచన చేసింది. దీంతో తీర ప్రాంత జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేశారు. ఇప్పటికే తుపాను కారణంగా దీంతో దక్షిణ మధ్య రైల్వే మూడు రోజుల పాటు కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.


Tags:    

Similar News