తెలుగు ను కాపాడుకోవాలి : అయ్యన్న
తెలుగును కాపాడుకోవాలసి ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు
తెలుగు అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదని, అది మన జీవన విధానం మరియు సంస్కృతి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు. గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న '3వ ప్రపంచ తెలుగు మహాసభల' ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
పండగలు మర్చిపోయి...
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. నేటి తరం పిల్లలకు మన ఆచారాలు, సంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమ్మలు చందమామను చూపిస్తూ పిల్లలకు గోరుముద్దలు తినిపించేవారని, కానీ నేడు సెల్ ఫోన్లను చూపిస్తూ అన్నం తినిపించే పరిస్థితి దాపురించిందన్నారు. అమ్మ పాడే లాలిపాటలో, చెప్పే కథల్లో, జరుపుకునే పండుగల్లో తెలుగు మాధుర్యం దాగి ఉందని గుర్తుచేశారు