Andhra Pradesh : ప్రజాప్రతినిధులకు పోలీసుల హెచ్చరికలు
ప్రజాప్రతినిధులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు
ప్రజాప్రతినిధులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. ఎవరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండవద్దని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలిపారు. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ రేపు మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో అటవీ ప్రాంత గ్రామాల్లో ఎవరూ ప్రజాప్రతినిధులు ఉండవద్దని కోరింది. ప్రతి ఒక్కరూ మైదానం ప్రాంతానికి తరలి వెళ్లాలని కోరారు.
అటవీ ప్రాంతాన్ని వీడి...
బంద్ నేపథ్యంలోనూ, మారేడుమిల్లి ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగే అవకాశముందని భావించి పోలీసులు ఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవ్వరూ శుభకార్యాలు,పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాకూడదని, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంటే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎవరూ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ అటవీ ప్రాంత గ్రామాలకు వెళ్లవద్దని పోలీసులు కోరారు.