Nara Lokesh : నేడు ఢిల్లీకి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అయితే కేవలం మర్యాదపూర్వకమైన భేటీ అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఒక సారి కుటుంబ సభ్యులతో కలసి ఢిల్లీకి రావాలంటూ పలుమార్లు కోరారు.
మర్యాదపూర్వక భేటీ...
ఇటీవల అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా లోకేశ్ ను ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో లోకేశ్ నేడు ముందుగా ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీకిబయలుదేరి వెళుతున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధిపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.