కొత్త రాష్ట్రంగా ప్రకటించండి

ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2022-12-31 03:24 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయాల్సిందేనని, లేకుంటే ఉత్తరాంధ్రను నూతన రాష్ట్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పూర్తిగా వెనకబడి పోయిందని, ఇలాగే కొనసాగితే మరింత కాలం ఒకచోటకే నిధులు మళ్లించే అవకాశాలున్నాయని ఆయన ఆవేదన చెందారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ నిధులన్నీ హైదరాబాద్ కే తరలించడం కారణంగా మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో బీటీ రోడ్డును ప్రారంభిస్తూ ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మౌనంగా ఉంటే...
మనం మౌనంగా ఉంటే నిధులన్నీ అమరావతికే వెళతాయన్నారు. చంద్రబాబు ఉద్దేశ్యం కూడా అదేనని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ఇక ఎప్పటికీ అలాగే ఉ:డి పోతుందని ధర్మాన అన్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నగరమని ఆయన మండి పడ్డారు. అందుకే పరిపాలన రాజధాని కోసం మనం పోరాడాలని, లేకుంటే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని మన బతుకులు మనం బతుకుదామని ధర్మాన అన్నారు.


Tags:    

Similar News