ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు

ఆంధ్రప్రదేశ్ ను తుపానులు వణికిస్తున్నాయి. వరస తుపానులతో ఏపీ తీర ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లుతోంది

Update: 2021-11-16 04:13 GMT

ఆంధ్రప్రదేశ్ ను తుపానులు వణికిస్తున్నాయి. వరస తుపానులతో ఏపీ తీర ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తాజాగా జవాద్ తుపానుతో ఏపీకి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన నికోబార్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి రానున్న రెండు రోజుల్లో తుపాను గా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపానుకు ముందుగానే జవాద్ గా నామకరణం చేశారు.

భారీ వర్షాలు....
ఆంధ్రప్రదేశ్ తీరానికి ప్రస్తుతం 1200 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమయింది. ఈ ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చిరుజల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. జవాద్ తుపాను ఈ నెల 18వ తేదీన తీరం దాటే అవకాశముంది.


Tags:    

Similar News