పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం

పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది

Update: 2025-11-18 07:12 GMT

తిరుమల పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి సతీష్‌కుమార్‌ మృతి కేసులో నిందితుడు రవికుమార్‌, ఇతర సాక్షులకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ అధికారులు కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని సీఐడీ డీజీ మెమో దాఖలు చేశారు.

హైకోర్టు ఆదేశం...
ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు అందుకు అంగీకరించింది. పరకామణి చోరీ కేసులో తదుపరి విచారణ డిసెంబర్‌ 2కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సతీష్‌కుమార్‌ అసహజ మరణ వార్తతో షాక్‌ అయ్యామని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. సీఐడీ విచారణకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News