Andhra Pradesh : ఈనెల 15,16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు, ఎస్సీలకు ప్రభుత్వ ప్రాధమ్యాలను వివరించనున్నారు

Update: 2025-09-11 02:20 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు, ఎస్సీలకు ప్రభుత్వ ప్రాధమ్యాలను వివరించనున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ ను నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ ప్రాధామ్యాలను జిల్లాల్లో అమలు చేయడం ఈ కాన్ఫరెన్స్ లో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్, మంత్రులు వివరించనున్నారు.

ముందుగా బదిలీలు...
దీంతో పాటు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన అంశాలను కూడా చర్చిస్తారు. జిల్లా కలెక్టర్లు కూడా తమ జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించే యోచనలోచంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. ఈ కాన్ఫరెన్స్ కు ముందు త్వరలో 10 జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. జిల్లా ఎస్పీలతో కూడా సమావేశం అవుతారు.


Tags:    

Similar News