Andhra Pradesh Liquor Case : రాజ్ కేసీరెడ్డి ఆస్తుల జప్తునకు పిటీషన్

లిక్కర్ కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి కోరనుంది

Update: 2025-08-21 07:38 GMT

లిక్కర్ కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి కోరనుంది. ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో పిటిషన్ సీఐడీ వేయడనుంది. లిక్కర్ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో ఆస్తులు కొనుగోలు చేసినట్టు సీఐడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది. 11 కోట్ల స్థిరాస్థులు, మూడు కోట్ల చరాస్తుల జప్తునుకు అనుమతివ్వాలని కోరనుంది.

అక్రమ ఆదాయం అంటూ...
రాజ్ కేసిరెడ్డికి చెందిన పదకొండు కోట్ల రూపాయలు ఇటీవల హైదరాబాద్ ఫామ్ హౌస్ లో లభించడంతో పాటు పలు ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన సీఐడీ ఈ మేరకు ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై విచారించి కోర్టు తీర్పు మేరకు సీఐడీ చర్యలు తీసుకోనుంది.


Tags:    

Similar News