Andhra Pradesh : పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. శ్రావణ మాసంలోనే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమైన నిర్ణయ తీసుకున్నారు

Update: 2025-07-05 04:35 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన నిర్ణయ తీసుకున్నారు. మూడు లక్షల ఇళ్లు పేదలకు అప్పగించేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇప్పటికూ పూర్తయిన ఇళ్లను లబ్దిదారులకు కేటాయించడంతో పాటు వారి గృహప్రవేశాలను కూడా ప్రజాప్రతినిధులు దగ్గరుండి చేయించేలా నిర్ణయం తీసుకుంది.

గృహప్రవేశాలు చేయించాలని...
శ్రావణమాసంలో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలలోనే శ్రావణ మాసం వస్తుండటంతో పనులు పూర్తి చేసిన ఇళ్లలో లబ్దిదారుల చేత గృహప్రవేశాలు చేయించి కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించాలని నిర్ణయించింది.


Tags:    

Similar News