విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-07-07 12:20 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వెళ్లే వచ్చే విద్యార్థులు రవాణా భత్యం పొందడానికి ప్రభుత్వం అనేక అర్హతలు నిర్దేశించింది. పాఠశాలలకు ఇంటికి వచ్చేందుకు విద్యార్థులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లే...
ఇంటికి, ప్రభుత్వ పాఠశాలకు కనీసం కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్న ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 6, 7,8వ తరగతి విద్యార్థులు ఈ రవాణా భత్యం పొందాలంటే స్కూలుకు, వారి ఇంటికి కనీసం మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండాలని నిబంధన పెట్టింది. ఈ విద్యార్థులకు నెలకు 600 రూపాయల చొప్పున మూడు నెలలకు ఒకేసారి పద్దెనిమిది వందల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది.


Tags:    

Similar News