Amaravathi : అమరావతి పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయా? కావాలంటే?

అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది

Update: 2025-07-13 04:16 GMT

అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. మూడేళ్లలో తొలి విడత పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు సంస్థలకు నిర్మాణ పనులను అప్పగించారు. పనులు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ భవనం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాస సముదాయాలు, హైకోర్టు భవనాల మాత్రం మూడేళ్లలో పూర్తి చేసి అమరావతికి కొత్త హంగులను సమకూర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ పనుల కోసం వేర్వేరుగా టెండర్లు పిలిచి ఖారరు చేయడంతో కార్పొరేట్ సంస్థలు ఈ పనులను వేగంగా పూర్తి చేయడానికి సిద్ధమయ్యాయి.

నిధుల కొరత ఉందంటూ...
అయితే అమారావతి నిర్మాణానికి సంబంధించి నిధుల కొరత ఉందన్న ప్రచారమూ అధికార వర్గాల్లో ఉంది. అమరావతి ఐకానిక్ వారధి నిర్మాణ అంచనా వ్యయం 2602.46 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇంటర్నల్ రింగ్ రోడ్ అంచనా వ్యయం 8,800 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. లెజిస్లేచర్ భవనం మధ్యలో పొడవాటి స్పైక్ నిర్మాణానికి 600 కోట్ల రూపాయల వ్యయ అంచనా అవుతుందని లెక్కలు వేశారు. నీరుకొండలో ఎన్.టి.ఆర్. విగ్రహం ఏర్పాటుకు 500 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. అంటే దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు వీటి నిర్మాణాలకు నిధులు అవసరమవుతాయి. కానీ ఇన్ని నిధులు ఎక్కడి నుంచి తేవాలన్న దానిపై అధికారుల మల్లగుల్లాలు పడుతున్నారు.
ఈ నెల 15న ఢిల్లీకి వెళ్లి...
వీటికి నిధులు ఎక్కడ నుంచి సమకూర్చాలన్న విషయంపై అధికారులు సందిగ్ధత నెలకొంది. నిధుల ఏర్పాటు విధానం తెలియక ఇలాంటి ఇరవై అతి ప్రధాన పనులకు ఇంకా పరిపాలన అనుమతులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రుతో చర్చించి అమరావతి పేరు మీద మరిన్ని వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. ప్రపంచ బ్యాంక్-ఎ.డి.బి. రుణంపై కూడా కేంద్రం ముందు కూడా మరింత రుణం కోసం వినతి పత్రాన్ని సమర్పించనుంది. 2028 31 మార్చి నాటికి అమరావతిలో పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళిక రచించినా నిధుల సమస్య వెంటాడుతుంది. మరి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News