Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... 25 కోట్లు ఖర్చయినా ఉచిత విద్యుత్తు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ఉత్సవాలు మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన మంటపాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని డిసైడ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేలకు పైగా గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
దుర్గాదేవి మంటపాలకు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టి పాటి రవికుమార్ ఈ మేరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని నిర్ణయించారు. గణేశ్ ఉత్సవం జరిపే మంటపాలకు ఉచిత విద్యుత్తు కారణంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అలాగే గణేశ్ ఉత్సవాలకు మాత్రమే కాకుండా దసరా నవరాత్రులు జరిపే దుర్గాదేవి మంటపాలకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఏపీ సర్కార్ కూడా అదే తరహాలో నిర్ణయించింది.