Andhra Pradesh : రేషన్ కార్డులున్న వారికి గుడ్ న్యూస్

రేషన్‌కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది.

Update: 2026-03-21 12:24 GMT

రేషన్‌కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. మీ సేవ ద్వారా పలు రకాల సేవలు పొందే అవకాశం కల్పించింది. ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు సేవలను మరింత సులభతరం చేసింది. ఇక నుంచి మీ సేవ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే రేషన్ కార్డు సేవలు పొందే అవకాశం కల్పించింది.

ఇక అన్ని రకాల సేవలు...
కొత్త కార్డు కోసం దరఖాస్తు, సభ్యుల చేర్పు-తొలగింపు, వివరాల అప్‌డేట్, కార్డు విభజన, ఆధార్ లింకింగ్, డూప్లికేట్ కార్డు వంటి మొత్తం 9 రకాల సేవలను సులభంగా పొందవచ్చు. ఈ ఆన్‌లైన్ విధానం వల్ల ఇకపై సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.


Tags:    

Similar News