తల్లికి వందనం పథకం డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండిలా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది

Update: 2025-07-01 02:54 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఈ పథకం అమలయింది. అనేక మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం నిధులు చేరిపోయాయి. కుటుంబంలో ఎందరు పిల్లలున్నా ఒక్కక్కరికీ పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి జమ అవుతున్నా ఇంకా తమకు పథకం అందలేదని ఫిర్యాదులు అందుతున్నాయి.

జులై 5వ తేదీ నుంచి...
అయితే ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అర్హత కలిగిన లబ్దిదారులకు మరో అవకాశం కల్పించాలని నిర్ణయించింది. రెండవ జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు విద్యార్థి తల్లి అకౌంట్ లో డిపాజిట్ కానున్నాయి. అయితే అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారులు వారి యొక్క పేర్లు రెండవ జాబితాలో ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలని చెప్పింది. పేరు పథకంలో ఉందో లేదో ఇలా చూసుకోండి gsws-nbm.ap.gov.in/NBM/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని తెలిపింది.


Tags:    

Similar News