ఏపీ సర్కార్ కు ఉద్యోగుల అల్టిమేటం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. వెంటనే పిఆర్సీ వేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు సాగర్ హెచ్చరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తమకు పీఆర్సీ వేయలేదని, వెంటనే పీఆర్సీ వేయాలని సాగర్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పీఆర్సీ వెంటనే ప్రకటించాలని...
ఇప్పటికే చాలా నష్టపోయామని, ఇప్పటికే చాలా భరించామన్న ఆయన ఇన్ని డిఏలు ఏ రాష్ట్రంలో పెండింగ్ లో లేవని తెలిపారు. ఇతర రాష్ట్రాల ముందు అవహేళనకు గురవుతున్నామని, వెంటనే పిఆర్సీ వేసి ఐ.ఆర్ ప్రకటించాలని ఏసీ అధ్యక్షుడు సాగర్ డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేదంటే అన్ని సంఘాలను కలుపుకొని పాతిక లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలతో భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.