నేడు విజయవాడకు పవన్ కల్యాణ్
నేడు విజయవాడకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్నారు.
నేడు విజయవాడకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్నారు. సనాతన ధర్మ యాత్ర పేరిట గత మూడు రోజులుగా కేరళ, తమిళనాడులో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. అనేక దేవాలయాలను సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. తన మొక్కులు చెల్లించుకోవడానికే దక్షిణాది దేవాలయాలకు వెళ్లానని పవన్ కల్యాణ్ తెలిపారు.
దక్షిణాది ఆలయాల యాత్ర...
నేటితో పవన్ కల్యాణ్ దక్షిణాది ఆలయాల యాత్ర పూర్తి కానుంది. తమిళనాడు తంజావూర్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు గన్నవరం పవన్ కల్యాణ్ చేరుకోనున్నారు. ఆయనకు పార్టీ నేతలు ఘనంగా విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. సాయంత్రం సీఎం చంద్రబాబుతో కలిసి మ్యూజికల్ ఈవెంట్ లో పాల్గొననున్నారు.