Pawan Kalyan : దుర్గగుడిలో పవన్ కల్యాణ్.. మెట్లను శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రికి వెళ్లారు. ఆలయ మెట్లను శుద్ధి చేశారు
pawan kalyan
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రికి వెళ్లారు. ఆలయ మెట్లను శుద్ధి చేశారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆయన దుర్గగుడికి వెళ్లి ఆలయమెట్లను శుభ్రం చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై చలించిపోయిన పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని ఆయన చేపట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి. దుర్గగుడికి వచ్చిన పవన్ కల్యాణ్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
1న తిరుమలకు పవన్....
మరోవైపు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబరు 2వ తేదీన విరమించనున్నారు. ఇందులో భాగాంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకొంటారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. తిరుమలవేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంపవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి విదితమే.2వ తేదీన తిరుమల కొండపై ఉంటారు. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు.