Andhra Pradesh : పవన్, బొత్స కలయికతో
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసీపీ నేత బొత్స సత్యనారాయణలు ఆత్మీయంగా పలుకరించుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసీపీ నేత బొత్స సత్యనారాయణలు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. గతంలోనూ ఇద్దరు నేతలు కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు వేర్వేరు పార్టీలయినా ఇద్దరు కలసి కరచాలనం చేసుకోవడం అప్పట్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.
తాజాగా అసెంబ్లీలో...
తాజాగా అసెంబ్లీలో ఫొటో సెషన్ ముగించుకుని పవన్ కల్యాణ్ లోపలికి వెళ్తుండగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్ కు బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీలు ఎదురొచ్చారు. బాగున్నారా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను బొత్స పలకరించారు. పరస్పరం పవన్ కల్యాణ్, బొత్స సత్యనారాయణ కరచాలనం చేసుకున్నారు.