నేడు హైదరాబాద్ కు జగన్.. కేబినెట్ మొత్తం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం. ఈ వివాహానికి జగన్ హాజరుకానున్నారు. ఉదయం పది గంటలకు బయలుదేరి హైదరాబాద్ రానున్నారు. హైటెక్స్ లోని కన్వెన్షన్ సెంటర్ లో జరిగే మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి జగన్ హాజరు కానున్నారు.
బొత్స ఇంట్లో వివాహానికి.....
అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ తాడేపల్లి బయలుదేరి వెళతారు. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు వివాహం కావడంతో ఏపీ కేబినెట్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది. దాదాపు 90 శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు వీఐపీలను రిసీవ్ చేసుకునే బాధ్యతను బొత్స సత్యనారాయణ అప్పగించారు. వైసీపీ నేతలు మొత్తం నేడు హైదరాబాద్ లోనే ఉన్నారు.