నేడు జగనన్న తోడు పథకం నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు

Update: 2022-02-28 01:35 GMT

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను జగన్ అంద చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. నిరుపేదలైన చిరు వ్యాపారులకు ప్రతి ఏటా ఒక్కొక్కరికి పదివేల రూపాయల వడ్డీ లేేని రుణాన్ని ప్రభుత్వం అందచేస్తుంది.

ఐదు లక్షల మంది....
ఈ పధకం కింద ఈ ఏడాది 5,10,462 మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 510 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. 16.16 కోట్ల రూపాయలను వడ్డీ రీ ఎంబర్స్ మెంట్ కింద చెల్లించనుంది. రోజూ వారీ పెట్టుబడుల కోసం అధిక వడ్డీకి ప్రయివేటు వడ్డీ వ్యాపారులను చిరు వ్యాపారులు ఆశ్రయిస్తుడటంతో జగన్ ఈ పథకాన్ని తెచ్చారు. వారికి అండగా నిలబడేందుకు నిర్ణయించారు.


Tags:    

Similar News