ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు

పీఎస్‌ఎల్‌వీ సీ-52 విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు

Update: 2022-02-14 07:30 GMT

పీఎస్‌ఎల్‌వీ సీ-52 విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భారత్ అంతరిక్ష సామర్థ్యాలను ఈ ప్రయోగం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మరింత ముందుకు తీసుకెళ్లిందని జగన్ అభిప్రాయపడ్డారు.

ప్రతి ప్రయత్నంలోనూ....
భవిష్యత్ లో జరిగే ప్రతి ప్రయత్నంలోనూ ఇస్రో విజయం సాధించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పీఎస్‌ఎల్‌వీ సీ-52 విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. భవిష‌్యత్ లో మరిన్న విజయాలు సాధించాలని వారిని అభినందించారు.


Tags:    

Similar News