నేడు విజయవాడలో క్వాంటమ్ వాలీ వర్క్ షాప్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో చంద్రబాబు పాల్గొంటారు. విజయవాడ నోవాటెల్ లో జరగనున్న క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ కు హాజరు కానున్న చంద్రబాబు అక్కడి వారితో చర్చిస్తారు. ఈ క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ కు అధికారులు కూడా హాజరు కానున్నారు.
హాజరుకానున్న చంద్రబాబు...
ఉదయం 10.15 గంటలకు విజయవాడ నోవోటెల్ హోటల్ కు చంద్రబాబు నాయుడు రానున్నారు. 10.30 గంటలకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో పాల్గొంటారు. చంద్రబాబు నాయుడు తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు వెల్లడించారు. నోవాటెల్ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.