Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. అధికారులతో పాటు మంత్రులతో సమావేశమై ఆ యా శాఖల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు.
శాఖలపై సమీక్ష...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్న 02.30 గంటలకు పౌర సరఫరాల శాఖ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 03.15 గంటలకు పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సమీక్షను నిర్వహించనున్నారు. సాయంత్రం 04.30 గంటలకు యోగాంధ్ర నిర్వహణపై అధికారులతో సమావేశమవుతారు.