నేడు టీడీపీ నేతలతో చంద్రబాబు కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు టీడీపీకి చెందిన మంత్రులతో సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు టీడీపీకి చెందిన మంత్రులతో సమావేశం కానున్నారు. మంత్రి వర్గం సమావేశం ముగిసిన అనంతరంసాయంత్రం టీడీపీ మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు, టీడీపీ సభ్యత్వంపై చర్చజరగనున్నట్లు తెలిసింది.
పథకాలను జనంలోకి...
ఎంపీలు, జోనల్ ఇంఛార్జ్‌లతో కూడా చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఆయా శాఖలపై ఎంపీలు దృష్టి పెట్టాలని ఇప్పటికే సీఎం సూచించారు. మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేలా నేటి సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను జనంలో తీసుకెళ్లేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు.