Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-05-29 03:35 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కడపలో మహానాడు ముగింపుసభ పూర్తయిన వెంటనే రాత్రికి కడప నుంచి ఢిల్లీకి చంద్రబాబు బయలుదేరి వెళతారు. రేపు సీఐఐ వార్షిక సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. రేపు రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే బస చేయనున్నారు.

పలువురు కేంద్ర మంత్రులను...
అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని తెలిసింది. యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను వివరించడంతో పాటు వారిని వచ్చే నెల 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రావాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా చర్చించనున్నారు.


Tags:    

Similar News