Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు.. ప్రధాని తో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-04-25 02:27 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. చంద్రబాబు దంపతులు ఇద్దరూ మోదీని కలసి అమరావతి పర్యటనకు ఆహ్వానించనున్నారు. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి నరేంద్ర మోదీ రానున్నారు.

అమరావతి పర్యటనకు...
ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం కూడా అధికారికంగా ప్రకటించడంతో ఆరోజు ముహూర్తంగా నిర్ణయించారు. అయితే రాజధాని పనులకు శంకుస్థాపనలు చేయించడానికి మోదీని స్వయంగా ఆహ్వానించేందుకు ఢిల్లీకి వెళ్లి ఆయనను కలసి ఆహ్వాన పత్రికను అందచేయనున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.


Tags:    

Similar News