Chandrababu : నేడు చంద్రబాబు ఢిల్లీకి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-03-05 02:43 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రికి ఆయన ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నానికి బయలుదేరి వెళతారు. కేంద్ర మంత్రులతో పాటు పలువురు నేతలను కలిసే అవకాశముందని తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు.

విశాఖకు వచ్చి...
కేంద్రానికి రావాల్సిన నిధులతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు అనుమతులకు చంద్రబాబు ఢిల్లీ పయనమై వెళుతున్నట్లు తెలిసింది. దీంతో పాటు పోలవరం, అమరావతి ప్రాజెక్టుల పురోగతి పై కూడా ప్రధానితో చర్చించనున్నారు. అక్కడి నుంచి విశాఖ వెళ్లిన చంద్రబాబు 6వ తేదీన తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లి ఆరో తేదీ రాత్రికి అక్కడే బస చేస్తారు. 7వ తేదీన అమరావతికి చేరుకుంటారు.


Tags:    

Similar News