Andhra Pradesh : నేడు ఢిల్లీకి చంద్రబాబు.. 26న సిక్కోలుకు సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విదేశీ పర్యటనకు ముగించుకుని ఢిల్లీకి చేరుకోనున్నారు

Update: 2025-04-21 02:53 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విదేశీ పర్యటనకు ముగించుకుని ఢిల్లీకి చేరుకోనున్నారు. తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి కుటుంబ సభ్యులతో కలసి యూరప్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నేడు ఢిల్లీకి చేరుకోన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

మత్స్యకారులకు ఇరవై వేలు...
మత్స్యకారులకు చేపల వేట నిషేధ భృతి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వైసీపీ హయాంలో మత్స్యకార భృతి పేరిట ఏటా పది వేల రూపాయలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే తాము ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి మత్స్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. దీనికి సంబంధించి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.


Tags:    

Similar News