ఉండవల్లిలో మంత్రులతో చంద్రబాబు సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకు చేరుకున్నారు. మంత్రులతో సమావేశమయ్యారు.

Update: 2025-01-24 12:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. దావోస్ పర్యటనపై ఆయన మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. అలాగే లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవిపై జరిగిన చర్చ కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది.

దావోస్ పర్యటనపై...
దావోస్ పర్యటనలో పెట్టుబడులు రాలేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, విపక్షాల విమర్శలకు సరైన రీతిలో స్పందించాలని మంత్రులకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. మంత్రులు సక్రమంగా రెస్పాండ్ కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మీడియాలో వస్తున్న వార్తలకుకౌంటర్ ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించినట్లు తెలిసింది.


Tags:    

Similar News