Chandrababu : నేడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు

Update: 2025-05-30 02:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం నాలుగున్నర గంటకు జరిగే సీఐఐ సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలతో పాటు తమ కూటమి ప్రభుత్వ విధానాలను సమావేశంలో చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలను కూడా చెప్పనున్నారు.

రాష్ట్రాభివృద్ధి గురించి...
ఇప్పటి వరకూ ఏపీకి గత ఏడాది కాలంలో వచ్చిన పరిశ్రమలు, ఎంవోయూ చేసుకున్న వాటి గురించి కూడా సమావేశంలో వెల్లడించనున్నారు. మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పనున్నారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ఈరోజు రాత్రికి చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రికి వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.


Tags:    

Similar News