Chandrababu : నకిలీ మద్యం కేసులో చంద్రబాబు సంచలన నిర్ణయం
నకిలీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు
నకిలీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు రాష్ట్ర డీజీపీతో పాటు ఎక్సైజ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. తంబళ్లపల్లి ములకల చెరువు నకిలీ మద్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో చంద్రబాబు సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. నకిలీ మద్యాన్ని ఎక్కడెకక్కడకు పంపారు? బెల్ట్ షాపుల్లో మాత్రమే కాకుండా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలకు కూడా సరఫరా చేశారా? అని అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
ఎక్కడ నకిలీ మద్యం ఉన్నా...
ఎక్కడ నకిలీ మద్యం ఉన్నా వెంటనే వాటిపై దాడులు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే నకిలీ మద్యం కేవలం ఉన్న సమాచారంమేరకు బెల్ట్ షాపుల ద్వారానే విక్రయించినట్లు తమ దర్యాప్తు లో వెల్లడయిందని చంద్రబాబుకు అధికారులు తెలిపినట్లు తెలిసింది. ఎవరు ఇందులో ఉన్నా చర్యలు తీసుకుని చట్టపరంగా వారికి శిక్షపడేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. తరచూ మద్యం దుకాణాలు, డంప్ లపై దాడులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.