Chandrababu Naidu : బరువు పెరిగే కొద్దీ శక్తి చాలదు సామీ... గుర్తుంచుకో గురూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత. అయితే విజన్ కు తగినట్లు నిధుల లేవు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత. అందులో ఎలాంటి సందేహం లేదు. ముందుచూపుతోనే ఆయన నిర్ణయాలు ఉంటాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత మాత్రం ఆయన కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఆయనను వెనక్కు లాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఆయన ముందుగా చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు అవుతున్నప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదనడం అతిశయోక్తి కాదు. ఇందులో ఐదేళ్లు చంద్రబాబు నాయుడు పాలించగా, మరో ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
గత పాలన సమయంలో...
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు రాష్ట్రానికి ఒక మంచి రాజధాని అవసరమని గుర్తించి అమరావతిని ఎంపిక చేశారు. రైతుల నుంచి భూసమీకరణ చేశారు. చంద్రబాబు నాయకత్వం, సమర్థతపై నమ్మకం ఉంచి రైతులు కూడా దాదాపు ముప్ఫయివేల ఎకరాలు రాజధాని అమరావతికి తమ వంతుగా ఇచ్చారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి నిర్ణయం జరిగిన తర్వాత తగిన సమయం లేకపోవడంతో పాటు నిధుల సమస్యతో కొంత రాజధాని నిర్మాణంలో వెనకబడింది. తాత్కాలిక భవనాలను నిర్మించి రాజధాని అమరావతిని ఏర్పాటు చేసుకుని పాలన కొనసాగించారు. అయితే 2019 లోపు అమరావతి నిర్మాణం అడుగు ముందుకు పడలేదు.
పోలవరం ప్రాజెక్టుపై...
పోలవరం కూడా ఆంధ్రప్రదేశ్ కు వరప్రదాయిని. పోలవరం పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందడమే కాకుండా ఉత్తరాంధ్రతో పాటు సీమాంధ్రకు కూడా తాగునీటి సౌకర్యాలను కల్పించే అవకాశముంటుంది. పోలవరం నిర్మాణ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో నిధుల కొరత కూడా లేదు. కానీ చంద్రబాబు తన తొలి దశ పాలనలో పోలవరం నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కూడా పోలవరం నిర్మాణాన్ని కంప్లీట్ చేయకపోవడంతో పదేళ్లుగా పోలవరం పనులు పూర్తి కాక అన్నదాతలతో పాటు అనేక మందికి ఈ నిర్మాణం పూర్తవుతుందా? లేదా? అన్న సందేహం వ్యక్తమవుతుంది.
రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత...
రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. వీటిని పూర్తి చేసి ముందుకు వెళ్లాల్సిన సమయంలో మిగిలిన అలివి కాని విషయాలను ఎత్తుకుంటే నవ్వుల కాక తప్పదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ను అభిమానించే వారే చంద్రబాబు గారు విజన్ గొప్పదే కానీ ఎలక్షన్లకు రెండోసారి వెళుతున్నప్పుడు ఆ విజన్ ఫెయిల్యూర్ అవుతుందని వెంకయ్య నాయుడు అంటున్నారని, ఇప్పుడు చంద్రబాబు చేయవలసిందిగా అమరావతి తొలిదశ పూర్తి చేయాలని, అలాగే పోలవరం పూర్తి చేయాలని కోరుతున్నారు.
వాటిని పక్కన పెట్టి...
ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని, ప్రస్తుతంప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాల కొనసాగించాని, రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించాలని, అందరికీ ఆరోగ్యం కల్పించాలని కోరుతున్నారు. రాబోయే ఎలక్షన్లకి ఏది ప్రాధాన్యత ఉంటే అది కల్పించాలని తెలుగుదేశం నాయకులు తమ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అమరావతి రెండో దశలో ఎయిర్ పోర్టు, పోలవరం బనకచర్ల ప్రాజెక్టు తర్వాత ఎలక్షన్లో గెలిచినప్పుడు మొదలు పెట్టాలని మొరపెట్టుకుంటున్నారు. అన్నీ ఒక్కసారి న్ని తలకెత్తుకుంటే ఏ పని కాదని, ఎందుకంటే మన బడ్జెట్ మన అప్పులు మన ఆదాయం ప్రధాన పాత్ర వహిస్తాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.