Chandrababu : ఊరికొకడు తయారయ్యాడు అందరిపని చెప్తా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీరుపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీరుపై మండిపడ్డారు. విశాఖలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. లా అండ్ ఆర్డర్ కు ఎవరు ఇబ్బంది కలిగించినా వదిలపెట్టేది లేదని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండి రాజకీయాల కోసం శాంతి భద్రతల సమస్యలు తెస్తామంటే కుదరదని చెప్పారు.
భూతాన్నిభూస్థాపితం చేస్తా...
ఎక్కడికి వెళ్లినా ఏపీలో ఒక భూతం ఉందని, అది మళ్లీ లేస్తే ఎలా అని అంతా భయపడుతున్నారని ఆ భూతాన్ని భూస్థాపితం చేశానని చెప్పానని చంద్రబాబు అన్నారు. రాజకీయం అంటే తమాషా కాని, మోసాలు, నేరాలు చేసి ఎదుటివారి మీద వేయడం కాదని, ప్రతిపక్షంలో ఉండి రౌడీయిజం చేస్తానంటే, ఇక్కడ ఉన్నది చంద్రబాబు అని గుర్తుంచుకోవాలన్నార. రౌడీయిజం చేస్తామంటే నోరు మాయించే శక్తి టీడీపీకి ఉందని, పులివెందుల మార్క్ రాజకీయం చేస్తానంటే తోక కట్ చేస్తానని హెచ్చరించారు. ఊరికొకడు తయారయ్యాడని అందరి పని చెప్తామంటూ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.