సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Update: 2025-01-28 08:11 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పిటీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాచేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. చంద్రబాబుపై కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు న్యాయవాది బాలయ్య ఈ పిటీషన్ వేశారు.

సీబీఐకి బదిలీ చేయాలని...
అయితే దీనిని విచారించిన జస్టిస్ బేలా త్రివేది పిటీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటీషనర్ తరఫున న్యాయవాదిపై సుప్రీంకోర్టు జస్టిస్ సీరియస్ అయ్యారు. ఇది పనికిమాలిన పిటిషన్ అని వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం, దీనిపై ఒక్కమాట మాట్లాడిన భారీ జరిమానా విధిస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఈ పిటిషన్‍పై వాదించడానికి ఎలా వచ్చారని న్యాయవాది మహేంద్ర సింగ్‍ జస్టిస్ త్రివేది ప్రశ్నించారు.


Tags:    

Similar News