Chandrababu : ఐదు రోజుల పాటు విదేశాలకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. అక్కడి నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. అక్కడి నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. ఈరోజు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు నాయుడు రేపు విదేశాలకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈనెల 17 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపారు.
ఐదు రోజుల పాటు...
పదిహేడో తేదీ నుంచి మొత్తం ఐదు రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటిస్తారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన విదేశాల్లో తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు.75వ పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలసి విదేశాల్లో జరుపుకోవడానికి ఆయన బయలుదేరి వెళుతున్నారు. వజ్రోత్సవ జన్మదినోత్సవ వేడులకను జరుపుకుంటున్నారు.