నేడు ఏపీ కేబినెట్ మీట్
ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
andhra pradesh cabinet meeting
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై కూడా సమావేశాల్లో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులను కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయి.
బాబు అరెస్ట్ తర్వాత...
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. కీలక బిల్లులను ఆమోదించి రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ఆమోదించుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీంతో పాటు చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపై కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశముంది.