Andhra Pradesh : మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ మంత్రి వర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు

Update: 2025-02-28 02:03 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం మరికాసేపట్లో జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ఈ సమావేశం ఆమోదించనుంది. 2024 లో ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.

బడ్జెట్ పై ఏ ఏ అంశాలకు...
బడ్జెట్ పై ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు వివరించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో బడ్జెట్ ను రూపొందించామని చెప్పనున్నారు. ఉదయం 9 గంటలకు సమావేశమైన మంత్రి వర్గ సమావేశం బడ్జెట్ ను ఆమోదించిన తర్వాత ముగియనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News