Breaking : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. బీసీలకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టాదార్ పాస్ పుస్తకం చట్టసవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ బిల్డింగ్ 2025 కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
21 అంశాల పరిధిలో...
గాజువాక రెవెన్యూ పరిధిలో భూముల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా మంత్రి వర్గ సమావేశం కొనసాగుతుంది. 21 అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీలో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేదానికి ఆమోదం తెలపడంతో ఇకపై భర్తీ అయ్యే పోస్టుల్లో ఈ ప్రాతిపదికన చేయనున్నారు.