17న ఏపీ బడ్జెట్

ఈ నెల 14వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 17న ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది

Update: 2023-03-11 06:12 GMT

ఈ నెల 14వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 17న ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్ 2.60 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ ను ప్రభుత్వం రూపొందించనుంది. ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో ప్రభుత్వ ప్రాధాన్యాలేమిటో ఈ బడ్జెట్ ద్వారా తెలియనుంది.

13 రోజుల పాటు...
నాలుగేళ్ల పాలన, మూడు రాజధానుల అంశం, సంక్షేమం, విశాఖ గ్లోబల్ సమ్మిట్ వంటి అంశాలే ప్రధాన అజెండాగా ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి తెలిసింది. 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. తర్వాత బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. అందిన సమాచారం మేరకు ఈ నెల 27వ తేదీ వరకూ సమావేశాలు జరిగే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం 13 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.


Tags:    

Similar News