Andhra Pradesh : నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2025-02-24 01:51 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎక్కువ రోజులు జరిగే అవకాశముంది.

28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న...
ఈ నెల 28వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే రోజు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ ను ఆమోదించనుంది. బడ్జెట్ సమావేశాలు కావడంతో పది నుంచి పదిహేను రోజుల పాటు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ ప్రాంతమంతా ఆంక్షలు విధించారు. ఎలాంటి నిరసనలు చేయడానికి వీలులేదని పోలీసులు 144 సెక్షన్ విధించారు.


Tags:    

Similar News