Andhra Pradesh : ఏపీ శాసనసభ సమావేశాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి

Update: 2026-01-25 12:47 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లు తెలిసింది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్న అదే రోజు శాసనసభ బీఏసీ సమావేశం జరగనుంది.

మార్చి రెండో వారం వరకూ...
బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అందిని సమాచారం మేరకు మార్చి రెండో వారం వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి పథ్నాలుగో తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేవపెట్టే అవకాశముంది. వ్యవసాయ బడ్జెట్ ను కూడకా ప్రవేశపెట్టనున్నారు.


Tags:    

Similar News